SRPT: గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగు కోసం ప్రజలు సహకరించాలని నడిగూడెం మండలం రత్నవరం గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం గ్రామంలోని నర్సరీ దగ్గర పిచ్చి మొక్కలకు గడ్డి మందు జీపీ సిబ్బందితో పిచికారి చేయించారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఫీల్డ్ ఆఫీసర్ గాలి వినిత ఉన్నారు.