AP: ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. జనవరి మొదటి వారంలో సీఎం వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు. రూ.456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులు చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడించారు.