NLG: అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా కృషి చేస్తానని కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన బడుగు చంద్రశేఖర్ తెలిపారు. సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, డీఈవో బిక్షపతి, కలెక్టరేట్ ఏవో మోతిలాల్ ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.