KMM: ఖమ్మం 17వ డివిజన్లో రూ. 29 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ పునుకొల్లు నీరజ బుధవారం శంకుస్థాపన చేశారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. డివిజన్ల వారీగా రహదారులు, డ్రైనేజీలు, వీధి లైట్ల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మేయర్ పేర్కొన్నారు.