ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ఏడాది కేసముద్రం, స్టేషన్ ఘన్పూర్, ములుగును కొత్త మున్సిపాలిటీలుగా ప్రకటించడంతో మొత్తం 260 వార్డులు, జనాభా 23,87,345కు చేరింది. ఎస్సీలు 2,69,316, ఎస్టీలు 49,045 ఉండగా, బీసీల జనాభా గణాంకాలు ప్రకటించకపోవడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఎంత ఉంటుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది