SKLM: లావేరు మండలం పెద్దకొత్తపల్లి పంచాయతీలో నూతన పౌజ్ పెన్షన్లను కూటమి నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఆరేళ్ల కృష్ణ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు పెన్షన్లు ఎంతో భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వెంకటరమణ, సచివాలయ సిబ్బంది హరీష్, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.