W.G: విద్యార్థులు చదువుతోపాటు నూతన సాంకేతికతపై అవగాహన పెంపొందించుకుని, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉండాలని ఏపీఐఐసీ ఛైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు అన్నారు. బుధవారం భీమవరంలో జరిగిన డేటా సైన్స్ జ్ఞానమయో ఏఐ టెక్స్ పోను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ పై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.