GNTR: గుంటూరు మిర్చి యార్డు సుబ్బారెడ్డి నగర్లో జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఅర్ సామాజిక భద్రత పెన్షన్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్‌దారుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, స్థానిక సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.