KRNL: కోడుమూరు జడ్పీ హైస్కూల్ మైదానాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పరిశీలించారు. జనవరి 3న వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాక సందర్భంగా జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ పర్యటనలో మంత్రి ఉల్లి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సందీప్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి పాల్గొన్నారు.