VZM: చెల్లూరు గ్రామంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఇవాళ ఎమ్మెల్యే పూసపాటి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. అంతకు ముందు అదే గ్రామంలో NTR భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లబ్ధిదారులకు సామాజిక ఆర్దిక భద్రత కల్పించే విధంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.