VZM: కావలి గ్రామంలో ఎంపీడీవో సురేశ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం జనవరి నెల పెన్షన్ను ఒకరోజు ముందుగా లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించింది. మండలంలోని 9,727 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.4.11 కోట్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 10% పంపిణీ పూర్తయినట్లు కూడా వెల్లడించారు.