NZB: భీమగల్ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేసినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. రాత్రి సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా బెజ్జోరా నుంచి ఆర్మూర్ వైపుగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీతో పాటు మరో మూడు లారీలను సీజ్ చేశామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.