ELR: కొయ్యలగూడెం(m) బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన ఎన్. మణికంఠ కుమార్ ఒకరికి నగదు పంప బోయి, పొరపాటున వేరే ఖాతాకు రూ. 1,50,000 బదిలీ చేశారు. దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్, కొయ్యలగూడెం పోలీసులు వేరొకరి ఖాతాకు మళ్ళిన నగదుని రికవరి చేశారు. బుధవారం పోలీసులు బాధితుని నగదును అందచేశారు. చేయి జారిన కష్టార్జితం తిరిగి లభించడంతో కృతజ్ఞతలు తెలిపారు.