NTR: విజయవాడ పోలీస్ కమిషనరేట్ నగర భద్రతను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ విజన్-2026′ను ప్రకటించింది. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్విజిబుల్ పోలీసింగ్, ప్రిడిక్టివ్ ప్రొటెక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ, ముందస్తు నేర నివారణ, డ్రోన్ నిఘా, ప్రవర్తనా విశ్లేషణలతో ప్రజలకు కనిపించకుండా భద్రత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కమిషనర్ రాజాబాబు తెలిపారు.