SDPT: బెజ్జంకి మండలంలోని గాగిల్లపూర్ గ్రామం నుంచి గుగ్గిళ్ల వరకు బీటి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఎస్టిమేషన్ సిద్ధం చేసే క్రమంలో సంబంధిత అధికారులు శనివారం కొలతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈ పీఆర్ తిరుపతిరెడ్డి రోడ్డు నిర్మాణానికి అవసరమైన సాంకేతిక వివరాలను పరిశీలించి కొలతలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో గాగిల్లపూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.