బెంజి కారులో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివారులో ఓ కారు నుంచి రూ.15 లక్షల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం పలు ఫామ్‌హౌజ్‌లకు ఈ డ్రగ్స్ తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా.. ప్రధాన నిందితుడు అగర్వాల్ కోసం గాలింపు కొనసాగుతోంది.