KMM: చింతకాని మండలం మత్కేపల్లిలో మంగళవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో రాములవారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామస్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.