WGL: ఖానాపురం మండలం కేంద్రంలోని బుధరావుపేట గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్‌ను ఇవాళ గ్రామ సర్పంచ్ రాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని అధికారులకు ఆదేశించారు.