AP: కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.20.77 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం డ్రైయిన్ ఆధునీకరణ పనులను చేపడుతోంది. ఈ పనులు పూర్తయితే వర్షాకాలంలో నీరు నిల్వదు. తద్వారా కొబ్బరితో పాటు ఇతర పంటలకు రక్షణ లభిస్తోంది. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీని DY CM పవన్ నేరవేర్చారు.