MBNR: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంపీ డీకే అరుణ తిరుమల శ్రీవారి ఆలయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఈ తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఆమె కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించి,ఉత్తరద్వారం ద్వారా దర్శనంచేసుకున్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలు, రైతులు, యువత, మహిళలకు ఆనందం కల్పించాలని ఆమె ఆకాంక్షించారు.