SDPT: తొగుట మండలం ఎల్లారెడ్డిపేట శివారులో పులి అడుగులను గ్రామస్తులు మంగళవారం గుర్తించారు. ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన దేవునూరి మహేష్ పొలం వద్ద పులి పాదముద్రలు గుర్తించారు. చిరుత పులి పాదముద్రలు గుర్తించడంతో అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. చిరుత పులి పాదముద్రలుగా అనుమానిస్తుండడంతో అటువైపు ఒంటరిగా వెళ్లవద్దని సూచిస్తున్నారు.