గద్వాల కోట చెన్నకేశవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ సివిల్ జడ్జి టీ.లక్ష్మీ స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా ఉదయం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ చేసిన ఏర్పాట్లను ఆమె అడిగి తెలుసుకున్నారు.