ADB: తాంసి మండలంలోని సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అసిస్టెంట్ ఇంజినీర్ మనోజ్ కుమార్ తెలియజేశారు. సబ్ స్టేషన్ పరిధిలోని కప్పర్ల, బండలనాగ్పూర్, జామిడి, పాలోడి గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.