AP: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా గోలిమి రామకృష్ణ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ప్యానెల్‌కు ఓటు వేసిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. సచివాలయంలో ఏ ఉద్యోగికి కష్టం వచ్చినా తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటానని చెప్పారు. హామీలు నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.