RR: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయానికి భక్తులు పోటెత్తారు.తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనార్థం భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు