KRNL: రైతుల కోసం ఎరువుల విక్రయంలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ డివిజన్ ఏడిఏ మోహన విజయకుమార్ హెచ్చరించారు. సోమవారం పత్తికొండ పట్టణంలో వ్యవసాయాధికారి వెంకటరాముడుతో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎంఆర్పీకి మించి ధరలు వసూలు చేయడం, పక్కదారి మళ్లింపు, రశీదు లేకుండా అమ్మకాలు చేస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.