ఆరెంజ్ క్యాప్: గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్ల్లో 759 పరుగులు చేసి ఈ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా(23 ఏళ్లు) రికార్డు సృష్టించాడు. పర్పుల్ క్యాప్: GT బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 15 మ్యాచ్ల్లో మొత్తం 25 వికెట్లు పడగొట్టి ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఈ అవార్డు అందుకున్నాడు.