విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ మరో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయమైంది. జనవరి 6న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో కోహ్లీ ఆడుతున్నట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ వెల్లడించారు. ఇప్పటికే ఈ టోర్నీలో కోహ్లీ 131, 77 పరుగులతో చెలరేగాడు. దీంతో తర్వాతి మ్యాచ్‌లో విరాట్ బ్యాటింగ్‌ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.