WG: సంక్రాంతి పండుగ సాకుతో కోడిపందాలు, గుండాట, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంఛార్జ్ తహసీల్దార్ ఫరూక్ హెచ్చరించారు. సోమవారం ఆకివీడు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సై, ఎంపీడీవో, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూద కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిరంతరం గస్తీ నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు