BHNG: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానికులకు, భక్తులకు కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఉదయం గం.3.30ని.ల నుంచి సాయంత్రం 6:00 వరకు వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి చేరుకొనుటకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే స్థానికులకు సాయంత్రం 3:30లకు అంతరాలయ దర్శనం కల్పించారు.