AP: విజయవాడ, తిరుపతిని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. అలాగే, రాజముద్రతో 21.8 లక్షల పాస్బుక్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 9లోగా పంపిణీ పూర్తి చేస్తామన్నారు. పాస్బుక్లపై గత పాలకుల ఫొటోలు తొలగించినట్లు తెలిపారు. తప్పులు సరిచేశాకే పాస్బుక్లు ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.