TG: పటాన్ చెరు దగ్గర పాశమైలారం వద్ద సిగాచీ పరిశ్రమ ఘటనలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. గల్లంతైన 8 మంది పేర్లపై మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. మృతుల బంధువులకు మరణ ధ్రువీకరణ పత్రాలను అధికారులు అందజేశారు. కాగా, జూన్లో పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడులో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.