‘వైకుంఠ ఏకాదశి’ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ పర్వదినాన భక్తులు ఉపవాసం, జాగరణ ఉండి, ఆలయాల్లోని ‘ఉత్తర ద్వారం’ గుండా శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారు. ఇలా దర్శనం చేసుకోవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.