కృష్ణా: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని గుడివాడ ఉప విద్యాశాఖాధికారి కొండా రవికుమార్ సోమవారం పరిశీలించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని, అలా సాధిస్తే మంచి కళాశాలలో సీటు పొంది బంగారు భవిష్యత్తు సాదించాలన్నారు.