GDL: గద్వాల శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి కలెక్టర్ సంతోష్ సోమవారం 5 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. 2026-27 విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు తాత్కాలికంగా పాత ఎస్పీ భవనం, కేజీబీవీ పాఠశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.