W.G: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం పీజీఆర్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్వో శివనారాయణ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు.