WGL: గీసుకొండ మండల కేంద్రంలోని ఊకల్ నాగేంద్రస్వామి ఆలయంలో రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ రాజేశ్వర్ రావు తెలిపారు. రేపు స్వామివారు శేషనాగుపై రంగనాథ స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడని.. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.