KMR: భిక్కనూర్ పట్టణానికి చెందిన వార్డు సభ్యులు గజ్జె వేణు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు.