కామారెడ్డి జిల్లాలో యాసంగి పంటలకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలో అన్ని కౌంటర్లలో యూరియా విక్రయం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. యూరియా కొనుగోలు చేసే రైతు ఆధార్ కార్డ్, పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకుని సెంటర్కు వెళ్లాలన్నారు.అవసరమైన కౌంటర్ల వద్ద శామియానాలు,తాగు నీటి వసతి కల్పించాలని సూచించారు.