HCA రిజిస్టర్డ్ క్రికెటర్ ఎం.రామ్ చరణ్ మార్కట్టాపై BCCI నిషేధం విధించింది. అతడిపై రెండేళ్ల నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. బీసీసీఐ ఆధ్వర్యంలోని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుంచి బ్యాన్ చేసింది. BCCI ఆదేశాల మేరకు 2027 DEC 28 వరకు నిషేధం విధిస్తున్నట్లు HCA తెలిపింది. క్రికెట్లో క్రమశిక్షణ, పారదర్శకత కోసం చర్యలు తీసుకున్నామని HCA స్పష్టం చేసింది.