విశాఖలో న్యూఇయర్ వేడుకల కోసం పోలీస్ కమిషనర్ కఠిన మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈవెంట్లకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని.. పబ్స్, హోటళ్లలో CCTV కెమెరాలు, భద్రత ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్, అశ్లీలతకు తావులేకుండా వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి టీమ్స్’ అందుబాటులో ఉంటాయని.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.