PLD: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. సోమవారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.