విశాఖ: జిల్లాలో చిన్నారుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన చైల్డ్ వెల్ఫేర్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు.