KNR: జమ్మికుంటలోని పద్మశాలి భవనంలో లెదర్ పార్క్ సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మోతె స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాచర్ల దశరథం, ఉపాధ్యక్షుడిగా మారపల్లి పోశెట్టి, ప్రధాన కార్యదర్శిగా కొలుగూరి విజయకుమార్, కార్యదర్శులుగా కొమరయ్య, సురేశ్, రాము, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్ నియమితులయ్యారు.