WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెడీమిక్స్ క్రషర్ వెంటనే తొలగించాలని కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్ ఇవాళ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారదకు వినతిపత్రం అందజేశారు. మహేష్ మాట్లాడుతూ.. క్రషర్ కొనసాగడంతో కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే క్రషర్ తొలగించాలని కోరారు.