చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముందస్తు జన్మదిన వేడుకలు పాండిచ్చేరిలో ఘనంగా జరిగాయి. జీజేఎం సెల్వ ఆధ్వర్యంలో ఓసియన్ స్ప్రే రిసార్టులో సోమవారం రాత్రి కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాండిచ్చేరిలోని స్థానిక పార్టీల నాయకులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు MLAను పూల కిరీటాలు, గజమాలలతో సత్కరించారు.