ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన పేరు, గొంతు, ఫొటోలు వంటి వ్యక్తిగత అంశాలను వాణిజ్య పరంగా వాడుకోకుండా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా దీనిపై నటుడు NTR స్పందించాడు. ‘ఢిల్లీ హైకోర్టు ద్వారా ‘పర్సనాలిటీ రైట్స్’ రక్షణను పొందాను. నేటి AI, డీప్‌ఫేక్ యుగంలో ఒక నటుడికి ఇది అత్యంత అవసరమైన రక్షణ. ఈ విజయంలో పాలుపంచుకున్న న్యాయవాదులకు కృతజ్ఞతలు’ అని ఆయన ట్వీట్ చేశాడు.