KRNL: దేవనకొండ మండలం పల్లె దొడ్డికి చెందిన ఈడిగ రాజశేఖర్ గౌడ్‌ను దేవనకొండ సొసైటీ ఛైర్మన్‌గా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన టీడీపీ నేత వైకుంఠం జ్యోతి, వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ బొజ్జమ్మకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి, రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.