MDK: తూప్రాన్ మండలం నర్సంపల్లి ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ జింక లింగం సస్పెన్షన్ చేయబడ్డారు. డీఆర్డీవో శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం, జింక లింగం ఓ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసి, ఓటు వేస్తే హాజరు వేస్తానని కూలీలను మభ్యపెట్టినట్లు 16న గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ ఫిర్యాదును దృష్టిలో ఉంచి సస్పెన్షన్ ఆదేశాలు ఇవాళ జారీ చేశారు