SDPT: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025-2026 విద్యా సంవత్సరానికి ఫిజిక్స్-1 అతిథి అధ్యాపకుల పోస్టు ఖాళీగా ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం సోమవారం తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హత ధృవీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలతో 2026 జనవరి 2, శుక్రవారం ఉదయం 11 గంటలకు కళాశాలలో హాజరు కావాలని తెలిపారు.